హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన సాగునీటి రంగ పథకాలు ప్రజల జీవన గమనాన్ని మార్చాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ పద్ధతులు పాటించాలని పిలుపునిచ్చారు. బుధవారం ‘ప్రపంచ జల దినోత్సవం’ పురస్కరించుకొని హరీశ్‌రావు ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి ప్రతిష్ఠా త్మక పథకాల రూపంలో తెలంగాణ ప్రజ లందరం ప్రపంచ జలది నోత్సవాన్ని జరుపుకొం టు న్నాం. ఈ ప్రాజెక్టులు తెలం గాణ ప్రజల జీవన గమనాన్ని మార్చి వేశాయి. ప్రజలు మరింత నీటి సంరక్షణ పద్ధతులు పాటించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.