Harish Rao | త్యాగాల చరిత్రకు న్యాయం జరిగిన రోజు.. అవమానాల అధ్యాయానికి ముగింపు పలికిన రోజు.. తెలంగాణ ఆత్మగౌరవ పతాకం సగర్వంగా ఎగిరిన రోజు.. నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు నేడు అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తెలిపారు.
కేసీఆర్ ఉద్యమ నాయకత్వం, సబ్బండ వర్గాల పోరాటం కలిసి తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకున్నదని హరీశ్‌రావు తెలిపారు. సాధించుకున్న రాష్ట్రాన్ని పదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నామని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపామని చెప్పారు. అమరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటూ, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
త్యాగాల చరిత్రకు న్యాయం జరిగిన రోజు..
అవమానాల అధ్యాయానికి ముగింపు
పలికిన రోజు..
తెలంగాణ ఆత్మగౌరవ పతాకం సగర్వంగా ఎగిరిన రోజు..
నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు నేడు.కేసీఆర్ గారి ఉద్యమ నాయకత్వం, సబ్బండ వర్గాల పోరాటం కలిసి తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకున్నది.… pic.twitter.com/cHntCfeOR8
— Harish Rao Thanneeru (@BRSHarish) June 2, 2026