Harish Rao | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించడం విడ్డూరంగా ఉన్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆక్షేపించారు. మెదక్‌లో బీజేపీని బీఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదని హితవుపలికారు. ఈ మేరకు గురువారం ఎక్స్ వేదికగా రేవంత్ తీరుపై మండిపడ్డారు. మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో మూడుచోట్ల బీఆర్ఎస్ మెజారిటీ సాధించిందని చెప్పారు.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు సొంత నియోజకవర్గం దుబ్బాకలో కూడా బీఆర్ఎస్ మెజారిటీ ఎలా సాధించిందని నిలదీశారు. రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో బీజేపీకి మెజారిటీ వచ్చిందని, రేవంతే అకడ బీజేపీకి కాంగ్రెస్ ఓట్లు మళ్లించారా? అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో బీజేపీ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారని, వారంతా కలిసి బీజేపీని గెలిపించారా? అని నిలదీశారు.
కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి 32 వేల మెజారిటీతో గెలిచారని, లోక్‌సభ ఎన్నికల్లో అకడ కాంగ్రెస్ అభ్యర్థికి 21 వేల మెజారిటీ మాత్రమే వచ్చిందని గుర్తుచేశారు. మిగతా ఓట్లను రేవంత్‌రెడ్డి బీజేపీకి వేయించారా? అని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మలాజిగిరిలో బీజేపీ భారీ మెజారిటీతో ఎలా గెలిచిందని నిలదీశారు. ఈ రెండు చోట్ల బీజేపీని కాంగ్రెస్ గెలిపించిందా? అని ప్రశ్నించారు.
బీజేపీ పంచన చేరి ప్రధాని మోదీ శరణుజొచ్చింది రేవంత్‌రెడ్డేనని హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్నారని ఆరోపించారు. నిండుసభలో మోదీని పె ద్దన్న అని సంబోధించింది రేవంత్‌రెడ్డి కాదా? అని నిలదీశారు. మోదీ, రేవంత్‌రెడ్డి కుమ్మకై సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నారని దుయ్యబట్టారు. విభజన హామీలపై మోదీ ప్రభుత్వాన్ని రేవంత్ గ ట్టిగా నిలదీయడం లేదని విమర్శించా రు. రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాం తీయ శక్తి అయిన బీఆర్ఎస్ను టార్గెట్ చేశాయని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటయ్యాయని రేవంత్‌రెడ్డి చెప్ప డం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు.