Harish Rao | ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు నాసిరకం యూనిఫారాలు అందించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మాట్లాడితే ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ అనే మీరు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీసం నాణ్యమైన యూనిఫారాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారా అని మండిపడ్డారు.
ఒకచోట యూనిఫారాలు అందలేదు.. అందినచోట కొలతలు సరిగ్గా లేవు. కుట్లు ఊడిపోతున్నాయి.. ఉతికితే రంగులు వెలిసిపోతున్నాయి. రెండు జతలు ఇవ్వాల్సి ఉండగా, చాలా చోట్ల ఒక్క జత కూడా పూర్తిగా అందలేదని హరీశ్‌రావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి గుజరాత్ దళారులపై ఉన్న ప్రేమ.. తెలంగాణ చేనేత కార్మికులపై లేదని అన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా స్థానికంగా యూనిఫారాల తయారీకి ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి.. కమీషన్ల కోసం బడా కార్పొరేట్ల నుంచి నాసిరకం యూనిఫారాలు తెప్పించి విద్యార్థులకు, చేనేత కార్మికులకు అన్యాయం చేశారని విమర్శించారు.
“మఫత్‌లాల్ ముద్దు.. చేనేత వద్దు” అన్నదే ప్రభుత్వ వైఖరిగా మారిందా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఒకవైపు చేనేత కార్మికుల ఉపాధికి గండి.. మరోవైపు విద్యార్థులకు నాసిరకం యూనిఫారాలు అందిస్తున్నారని.. దీంతో విద్యార్థులకు కష్టం.. చేనేత కార్మికులకు ఉపాధి నష్టం వాటిల్లుతుందని చెప్పారు. నాసీరకం యూనిఫామ్ లపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు రేవంత్ రెడ్డి?
మాట్లాడితే ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ అనే మీరు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీసం నాణ్యమైన యూనిఫారాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారా?
ఒకచోట యూనిఫారాలు అందలేదు.. అందినచోట కొలతలు సరిగ్గా లేవు. కుట్లు ఊడిపోతున్నాయి..… pic.twitter.com/qACKY1EB1W
— Harish Rao Thanneeru (@BRSHarish) August 23, 2026