Harish Rao | సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 19: రాజకీయాల్లో గంభీరంగా కనిపించే హరీశ్‌రావు.. ఓ చిన్నారి కథవిని.. కన్నీరు పెట్టుకున్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై హరీశ్‌రావు శనివారం సిద్దిపేటలో ‘భద్రంగా ఉండాలి.. భవిష్యత్‌లో ఎదగాలి’ పేరుతో ఓ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మోటివేషనల్ స్పీకర్ రంజిత్ తల్లిదండ్రుల మాట వినాలని, పెద్దలను గౌరవించాలని, వారికి విలువ ఇవ్వాలని విద్యార్థులకు బోధించారు.
అనంతరం పిల్లల మనోభావాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని సాత్విక మాట్లాడుతూ.. తాను రెండో తరగతిలో ఉన్నప్పుడే నాన్న చనిపోయాడని, అమ్మ కష్టార్జితంతోనే చదువుకుంటున్నానని చెప్తూ భోరున విలపించింది. అమ్మకు చేదోడుగా ఉంటానంటూ చెప్పింది. దీంతో హరీశ్‌రావు భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. సాత్వికను ఆత్మీయంగా అక్కున చేర్చుకుని, కార్యక్రమం పూర్తయ్యేంత వరకు తనతోనే కూర్చొబెట్టుకున్నారు. సాత్విక కుటుంబ పరిస్థితులపై ఆరా తీసి.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
తండ్రి చనిపోయినా కష్టపడి చదువుతున్న చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి హరీష్ రావు
తండ్రి చనిపోయాడని.. తన తల్లి కష్టపడి చదివిస్తుందన్న ఓ చిన్నారి కథ విని స్టేజి పైనే కంటతడి పెట్టుకుని.. చిన్నారిని ఓదార్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్… pic.twitter.com/49x2DokEC4
— Telugu Scribe (@TeluguScribe) April 19, 2025