వినాయక చవితి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వినాయకచవితి పర్వదినాన్ని ప్రజలంతా కుటుంబసమేతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, సకల కార్యాలకు ప్రథమ పూజ చేసేది, పూజించేది విఘ్నేశ్వరుడినే అని, ఆ దేవుడి అనుగ్రహంతో విఘ్నాలు తొలిగి అన్నింటా శుభం చేకూరాలని ఆయన ఆకాంక్షించారు.
నిర్విఘ్నంగా అన్ని కార్యాలు నెరవేరాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ప్రార్థించారు. మట్టి గణపతి ప్రతిమను పూజించాలని కోరారు. ‘మట్టి గణపతే మహా గణపతి’ అని తెలిపారు.