హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కొనియాడారు. బడుగుల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని బుధవారం ఎక్స్ వేదికగా కొనియాడారు. ఆ మహనీయుడి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో జయంత్యుత్సవాలు, వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించిన ఘనత కేసీఆర్‌కే దకిందన్నారు.
మెట్పల్ల్లి, ఏప్రిల్ 2: పసుపు ధర ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నది. బుధవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో పసుపు కాడి రకానికి గరిష్ఠంగా క్వింటాల్ ధర రూ.14,669 పలికింది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. రెండు, మూడు రోజులుగా పెరుగుతున్న ధరలతో ఆశలు రేకెతిస్తున్నప్పటికీ మెజార్టీ రైతులకు పెద్దగా ఒరిగేదేమి లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మెజార్టీ రైతులు దాదాపు 80 శాతం మేర పసుపును మార్కెట్లో విక్రయించారు.