హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ సర్కారు 17 నెలల పాలనలో నీళ్ల వినియోగం, నిధుల సాధన, నియామకాల్లో విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కృష్ణా నీళ్లను కాపాడటంలో, ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్లను అడ్డుకోవడంలో విఫలమైందని ఎక్స్ వేదికగా విమర్శించారు.
రూ.8,929 కోట్ల రుణ విముక్తి చేయకపోవడం సర్కారు పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను భర్తీచేయడంలో విఫలమైందని విమర్శించారు. అన్నింటా వెనుకబడి పోవడమే కాంగ్రెస్ సర్కారు విజన్ అని దెప్పిపొడిచారు.