Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చినా సిబ్బంది కష్టాలు చెప్పుకుంటున్నారంటూ హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ తీరుపై తీవ్రంగా స్పందించారు. గచ్చిబౌలి పీఎస్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇక్కడ (పోలీస్‌స్టేషన్‌లో) బాధ కానిస్టేబుల్స్ సహా అందరూ బాధపడుతున్నరు. ఏమంటున్నరు హోంగార్డులు.. నేను అధికారంలోకి వస్తే.. మూడునెలల్లో హోంగార్డులను పర్మినెంటు చేస్తానని అన్నడు.. ఇప్పుడు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కానిస్టేబుల్స్‌కు రావాల్సిన సరెండ్ లీవ్ డబ్బులు పెండింగ్‌లో ఉన్నయ్. ఒక్కో సరెండర్ లీవ్ అంటే రూ.30వేలు, రూ.40వేలు వస్తే పిల్లల ఫీజులు కట్టుకుంటాం.. ఎవరికి చెప్పుకోవాల్నో అర్థం అవుతలేదు అంటూ బాధపడుతున్నారు. ఇవాళ పోలీసులకు రావాల్సిన ట్రావెలింగ్ అలవెన్స్.. కేసీఆర్ 15రోజులు ఇస్తే.. నువ్వు ఏడురోజులకు తగ్గించినవ్. ఆ టీఏ డబ్బులు ఏడు నెలల నుంచి వస్తలేవు.. కస్తీలు, ఈఐఎంలు కట్టుకోలేకపోతున్నమని పోలీస్ సిబ్బంది బాధపడుతున్నారు’ అని తెలిపారు.
‘కేసీఆర్ ఉన్నప్పుడు పోలీస్‌స్టేషన్‌కు రూ.75వేలు నెలనెలా ఇచ్చిండు. స్టేషన్ అలవెన్స్ ఇస్తే.. నువ్వు వచ్చాక బంద్ అయ్యింది. కాగితాలు, ప్రింటర్లకు గోస ఉన్నది. సీసీ కెమెరాలు పని చేయకపోతే రిపేర్ చేసే దిక్కులేదని పోలీసులు బాధపడుతున్నరు. నువ్వు ఎవరిని ఉద్దరించినవ్. పోలీస్‌స్టేషన్‌కు వస్తే.. ప్రతిపక్షాని బాధలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. రైతులకు మద్దతు ధర లేదు. పత్తిని మద్దతుతో కొనే దిక్కులేదు. చెప్పిన బోనస్ రాదు. రైతు రుణమాఫీ లేదు. రైతుబంధు పడకపాయే.. అవ్వాతాతలకు రెండునెలల పెన్షన్ ఎగ్గొడితివి. కష్టాలు తప్ప నీ పాలనలో చేసిందేంది? అసలు ఎప్పుడున్న ఒక్కరోజు శాసనసభలో మమ్మల్ని మాట్లాడనిచ్చినవా? మంచి సూచనలు ఇస్తామంటే.. వినే ఓపిక ఉన్నదా? రేవంత్‌రెడ్డిని అడుగుతున్నా.. ఏడాదిగా ఉపన్యాసాలు ఇచ్చినవ్.. ఏ ఉపన్యాసంలోనైనా కేసీఆర్ పేరు ఎత్తకుండా ఉపన్యాసం ఇచ్చవా? ముఖ్యమంత్రిగా ప్రజలకు గురించి.. పాలసీ గురించి.. అభివృద్ధి గురించి మాట్లాడినవా? నోరు తెరిస్తే పేగులు మెడలేసుకొని తిరుగుతా.. గోటీలు ఆడుతా.. లాగులో తొండలుజొర్రగుడతా.. పిచ్చి బూతులు తప్ప.. ఏనాడన్నా సక్కటి మాట మాట్లాడినవా..? కేసీఆర్ పేరు ఎత్తకుండా ఉపన్యాసం ఇచ్చినవా?’ అంటూ తీవ్రంగా స్పందించారు.