Harish Rao | మంత్రి కోమటిరెడ్డి ‘చెప్పు’ వ్యాఖ్యలపై హరీశ్ రావు ఆగ్రహం..
కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌పై (KCR) వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లగొండలో బీఆర్ఎస్ సభ పెట్టడంతోనే.. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పజెప్పడంపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు.
హైదరాబాద్: కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌పై (KCR) వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లగొండలో బీఆర్ఎస్ సభ పెట్టడంతోనే.. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పజెప్పడంపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్యదూరమైన ప్రజెంటేషన్ ఇచ్చారని విమర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి కలుగజేసుకుని మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ స్టేట్మెంట్ విన్నతర్వాత కేసీఆర్ తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్కు నల్లగొండ ప్రజలు చెప్పుతో కొట్టినట్లు సమాధానమిచ్చారని చెప్పారు. దీంతో మంత్రి వ్యాఖ్యలపై హరీశ్ రావు అభ్యంతరం తెలిపారు.
పదేండ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాహుల్ గాంధీని చెప్పుతో కొడతామని తాము అనలేమా అని ప్రశ్నించారు. అమేథీలో రాహుల్‌ని కూడా ప్రజలు చెప్పుతో కొట్టినట్టేనా అని నిలదీశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డులను తొలగించాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభాపతి ఏకపక్షంగా మంత్రి అవకాశం ఇవ్వడం తగదని విమర్శించారు. మంత్రి క్షమాపణలు చెబితేనే తాను మాట్లాడుతానని పట్టుబట్టారు. దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ రికార్డుల నుంచి మంత్రి వ్యాఖ్యలను తొలగిస్తానని ప్రకటించడంతో హరీశ్ రావు తన ప్రసంగాన్ని కొనసాగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

