Harish Rao | ఇళ్లను కూలగొడుతున్నాడే తప్పా.. ఏడాదిగా కూలగొట్టుడే తప్ప ఒక్కటైనా కట్టావా..? రేవంత్ రెడ్డి అంటూ హరీశ్‌రావు ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ క్రికెట్ ఫైనల్ విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబంధును రేవంత్ రెడ్డి బంద్ పెట్టిండని.. యాదవులకు గొర్రెలను బంద్ పెట్టిండని విమర్శించారు. హైడ్రాను తెచ్చి ఇళ్లను కూలగొడుతున్నడని.. ఏడాదిగా కూలగొట్టుడే తప్ప ఒక్కటైనా కట్టావా రేవంత్ రెడ్డి? అంటూ నిలదీశారు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి హిట్ వికెట్ అయిండు మండిపడ్డారు. దేవుండ్ల మీద ఒట్టు పెట్టి హిట్ వికెట్ అయిండని.. లగచర్లలో రైతులని జైలో పెట్టి హిట్ వికెట్ అయిపోయిండని.. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇష్టం లేదన్నారు. ముఖ్యమంత్రిగా నీ పని అయిపోయిందని.. కేసిఆర్ డ్యూటీని మాణిక్ యాదవ్ నిర్వహించి నన్ను పిలవడం చాలా సంతోషంగా ఉన్నారు. అమీన్‌పూర్‌తో నాకు మంచి అనుబంధం ఉందన్నారు. నీళ్ల బాధలు చూశానని.. ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. మిషన్ భగీరథతో బిందెలు పట్టుకునే అవసరం లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.
రోడ్లు వేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని.. మున్సిపాలిటీలు చేసిన ఘనత బీఆర్ఎస్ది.. ప్రజల కోసం ప్రశ్నిస్తే మమ్మల్ని తిడుతాడన్నారు. ప్రతిపక్షం ప్రశ్నిస్తే తిట్లని.. 2లక్షల ఉద్యోగాలు ఎటుపాయే? అంటూ మండిపడ్డారు. 15 ఆగస్ట్ వరకు రుణమాఫీ చేస్తనని దేవుళ్ల మీద ఓట్లు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియేనని.. గద్దె ఎక్కి 12 నెలలు అయినా.. ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ వాళ్లు వస్తే చొక్కా పట్టుకొని మా పైసలు ఎటుపోయేనని అడగాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఇస్తున్నాడు కదా..? ఇక్కడ రేవంత్ ఎందుకు ఇవ్వడు? తెలంగాణను తాగుబోతు తెలంగాణ చెయ్యాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ మాత్రమే తెలంగాణకు రక్ష అని.. రైతుబంధును బంధు పెట్టిండని.. రేవంత్ రెడ్డి యాదవ్‌లకి గోర్లని బంధు పెట్టిండన్నారు. రేవంత్ రెడ్డి హైడ్రాని తెచ్చిండు కులకొట్టుడు గానీ కట్టుడు ఒక్కటైనా కట్టావా రేవంత్ రెడ్డి అంటూ ధ్వజమెత్తారు. సంవత్సరంలో అల్లు అర్జురని అరెస్ట్ చేసి, దేవుండ్ల మీద ఒట్టు పెట్టి, లగచర్ల రైతులను జైలులో పెట్టి రైతులను జైలులో పెట్టి హిట్ వికెట్ అయ్యాడని.. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని.. ముఖ్యమంత్రిగా నీ పని అయిపోయిందన్నారు.