హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : అధికారులను ఉరి తీ యాలని విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలు చెబుతాయా? ఇది ప్రజాస్వామ్యమా? లేక రేవంత్ రాచరిక రాజ్యమా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు నియామక పత్రాలు అందించి, తమ ఘనతగా చెప్పుకునేందుకు సీఎం తంటాలు పడ్డడు. నియామక పత్రాలు అందిస్తూ నాలుగు మంచి మాటలు చెప్పాల్సింది పోయి, అబద్ధాలు వల్లె వేసిండు.
ఉద్యోగాల్లో చేరుతున్న వారిలో ఉత్సాహాన్ని నింపాల్సింది పోయి, వార్నింగ్ ఇచ్చి, భయభ్రాంతులకు గురి చేసిండు. ఇంతకంటే అజ్ఞానం ఉన్న వ్యక్తి సోమాలియా నుంచి అమెరికా వరకు ఎకడ వెదికినా కనిపించడు కావొచ్చు’ అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20లక్షల ఎకరాలకు (కొత్త, స్థిరీకరణ) సాగునీరు అందించినట్టు అసెంబ్లీ సాక్షిగా మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలోనే ప్రకటించారు. మళ్లీ ఇప్పుడు 50వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని హరీశ్‌రావు దుయ్యబట్టారు.