హైదరాబాద్: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఇంట విషాదం నెలకొంది. హరీశ్ తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. హైదరాబాద్ కోకాపేటలోని క్రిన్స్‌విల్లాస్‌లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. హరీశ్‌రావుకు పితృవియోగంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో నిర్వహించబడతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు..

హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.