లక్ష్మణ్గౌడ్ది ప్రభుత్వ హత్యే
తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్గౌడ్ది పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యేనని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే భూరికార్డులు మార్పిడి చేసి, జేసీబీ యం త్రాన్ని సీజ్‌చేసి భారీ జరిమానా విధించి లక్ష్మణ్‌గౌడ్‌ను అనేక రకాలుగా ఒత్తిళ్లకు గురిచేసి మానసికంగా వేధించారని ఆరోపించారు. దీనికితోడు పంటలకు దేవాదుల ద్వారా సాగునీరందక, కరెంటు సరిగా సరఫరాకాక వ్యవసాయంలో నష్టం వచ్చి అప్పులు అయ్యాయని పేర్కొన్నారు.
- భూరికార్డులు మార్పిడి చేసి మానసికంగా వేధించారు
- జేసీబీ యంత్రాన్ని సీజ్ చేసి భారీ జరిమానా వేశారు
- కొన్నెలో మృతుడు వేముల లక్ష్మణ్‌గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన హరీశ్, పల్లా
- కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ రూ.10 లక్షల ఆర్థికసాయం
- పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హరీశ్, పల్లా భరోసా
జనగామ, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్గౌడ్ది పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యేనని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే భూరికార్డులు మార్పిడి చేసి, జేసీబీ యం త్రాన్ని సీజ్‌చేసి భారీ జరిమానా విధించి లక్ష్మణ్‌గౌడ్‌ను అనేక రకాలుగా ఒత్తిళ్లకు గురిచేసి మానసికంగా వేధించారని ఆరోపించారు. దీనికితోడు పంటలకు దేవాదుల ద్వారా సాగునీరందక, కరెంటు సరిగా సరఫరాకాక వ్యవసాయంలో నష్టం వచ్చి అప్పులు అయ్యాయని పేర్కొన్నారు.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నెలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ కార్యకర్త లక్ష్మణ్‌గౌడ్ కుటుంబాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలుచల్లి ఘనంగా నివాళ్లర్పించారు. మృతుడి భార్య స్వప్న, సోదరుడు వేణు, ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడి ఆత్మహత్యకు పురిగొల్పిన పరిస్థితులు, అప్పులకు కారణాలను అడిగి తెలుసుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.10 లక్షల ఆర్థిక సాయం చెక్కును లక్ష్మణ్‌గౌడ్ భార్యకు అందజేశారు. కుటుంబానికి అన్నివిధాలా పార్టీ అండదండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష్మణ్‌గౌడ్‌కు చెందిన సొంత జేసీబీ వాహనంపై మైనింగ్ కేసు నమోదుచేసి నెలల తరబడి పోలీస్‌స్టేషన్‌లో పెట్టి భారీ జరిమానా విధించారని తెలిపారు. తన కుటుంబానికి చెందిన ఏడెకరాలతోపాటు మరో ఆరెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయ చేస్తున్నాడని, ఈ ఏడాది పంటలన్నీ ఎండిపోయి తీవ్రంగా నష్టపోయాడని తెలిపారు.
లక్ష్మణ్‌గౌడ్ కుటుంబానికి చెందిన భూమిని తమకు చెందినదంటూ జానారెడ్డి పీఆర్వోగా చెప్తున్న ఓ వ్యక్తి కాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహంతో దరఖాస్తు చేసుకుంటే.. ఆ భూమిని జనగామ కలెక్టర్ నిషేధిత జాబితా (ప్రొహిబిషన్ లిస్టు)లో పెట్టి లాక్కునే ప్రయత్నం చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. లక్ష్మణ్‌గౌడ్ కుటుంబం 60, 70 ఏండ్ల నుంచి వారసత్వంగా అనుభవిస్తున్న భూమి తాత, తండ్రి, కుమారుల పేర్లపై ధరణి, భూభారతి, రెవెన్యూ రికార్డుల్లో ఉన్నదని, రైతుబంధు కూడా వచ్చేదని పేర్కొన్నారు. అలాంటి భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆకస్మికంగా రికార్డులు మార్పిడి చేయడంతో దాన్ని అమ్ముకొని అప్పులు తీర్చే అవకాశం సైతం కోల్పోయిన లక్ష్మణ్‌గౌడ్ మరింత మనస్తాపానికి గురయ్యారని తెలిపారు. లక్ష్మణ్‌గౌడ్ ఆర్థిక పరిస్థితి తమ దృష్టికి వచ్చి ఉంటే తప్పకుండా తమ్ముడిని కాపాడుకునే వాళ్లమని తెలిపారు.
లక్ష్మణ్‌గౌడ్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగమిస్తాం
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, లక్ష్మణ్‌గౌడ్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి కుటుంబానికి పూర్తి అండదండగా ఉంటామని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. ఇప్పటికే వారి పిల్లలను చదివించే బాధ్యత స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీసుకున్నారని, పార్టీపరంగా ఆర్థిక సాయం అందించామని గుర్తుచేశారు.
లక్ష్మణ్‌గౌడ్ కుటుంబ బాధ్యత నాదే: ఎమ్మెల్యే పల్లా
తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్‌గౌడ్ కుటుంబం ఒంటరిది కాదని, కష్టకాలంలో ప్రతి విషయంలోనూ తాను తోడుగా ఉంటానని, భార్యకు ఉద్యోగం, పిల్లల చదువుల బాధ్యత తనదేనని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. వారిది బీఆర్ఎస్ కుటుంబమని, ఉద్యమకారుల కుటుంబమని, పార్టీ కుటుంబమని స్పష్టంచేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా అండదండగా నిలిచి ఆ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉన్నదని తెలిపారు.
ప్రభుత్వ దవాఖానలో అవకాశం రాకుంటే తన సొంత సంస్థల్లో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ఎలాంటి సహాయం చేయకుండా తమనే విమర్శిస్తున్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తీరును తప్పుబట్టారు. గతంలో ఎమ్మెల్యే పదవిని వైఎస్ కాళ్ల దగ్గర పెట్టిన వారు ఇప్పుడు తమను విమర్శించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఉద్యమకారుల పేరుతో రాజకీయం చేస్తూ విమర్శలు చేయడం, దిగజారుడుతనంతో మాట్లాడటం దురదృష్టకరమని ధ్వజమెత్తారు. లక్ష్మణ్‌గౌడ్ కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా అనుభవిస్తున్న భూమి విషయంలో ప్రస్తుత కలెక్టర్ ప్రత్యేకంగా స్పం దించి ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
సాగునీటి సౌకర్యం కల్పించాలి
బచ్చన్నపేట, నవంబర్ 10: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి సాగునీటి సౌకర్యం లేక పంటలన్నీ ఎండిపోతున్నాయని పోచన్నపేట గ్రామానికి చెందిన పలువురు రైతులు, ప్రజలు మాజీ మంత్రి హరీశ్‌రావుకు మొరపెట్టుకున్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి కొన్నె గ్రామానికి వెళ్తుండగా పోచన్నపేట చేరుకోగానే హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి గులాబీ శ్రేణులతోపాటు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి వారు నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ఏటా రెండుసార్లు గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నిండి పంటలు పండేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాగునీటి సౌకర్యం కరువైందని ఏకరువు పెట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

