మిమ్మల్ని రిగ్గింగ్ చేయమనట్లే!
‘మీ నుంచి ఈ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఆశించడం లేదు.
- నిజాయితీగా డ్యూటీ చేయమని చెప్తున్నం
- ప్రాబ్లంలో ఉన్న ప్రాబ్లంను అర్థం చేసుకోవాలి
- నూతన డీఎస్పీల మాటామంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘మీ నుంచి ఈ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఆశించడం లేదు. రేపు ఎన్నికలప్పుడు బూత్‌లలో రిగ్గింగ్ చేసి, అన్ని ఓట్లూ మీరే వేయండని కూడా ఆశించడం లేదు’ అంటూ ప్రొబేషనరీ డీఎస్పీలతో సీఎం రేవంత్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డీఎస్పీలుగా నూతన బాధ్యతలు చేపట్టబోతున్న వారికి హితబోధ చేసే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రభుత్వానికి, ప్రజలకు వారు నిజాయితీగా పనిచేయాలనే ఉద్దేశాన్ని.. ఇలా వక్రీకరించి చెప్పడంతో అవాక్కవడం నూతన డీఎస్పీల వంతయింది.
డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ సమయంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. మంగళవారం వారితో ఎంసీహెచ్ఆర్డీలో మాటామంతి నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఒక సమస్యను అర్థం చేసుకొని, దానికి శాశ్వత పరిష్కారం కనుగొనాలనే ఉద్దేశంతో చేసిన మాటల్లో ఆయన తడబడ్డారు. ‘ప్రాబ్లంలో ఉన్న ప్రాబ్లంను అర్థం చేసుకోవాలి’ అంటూ అర్థపర్థంలేకుండా మాట్లాడారు. నూతనంగా బాధ్యతలు చేపట్టే వారు దూకుడుగా ఉండొద్దని పేర్కొన్నారు.
‘మీ డ్యూటీని ఎంత పొదుపుగా వాడితే అంత ఎక్కువకాలం మన్నిక ఉంటుంది’ అని చెప్పారు. అతిగా డ్యూటీ చేస్తే ఇబ్బందులు తప్పవని తెలిపారు. కారు కొంటే దానిని పొదుపుగా వాడితే ఏండ్లపాటు మన్నిక ఉంటుందంటూ మరో స్వోత్కర్ష చెప్పుకొచ్చారు. ‘అధికారంలోకి వచ్చేవాళ్లు కూడా పొజీషన్లో ఉండేవాళ్లు కూడా దాన్ని జాగ్రత్తగా, పొదుపుగా ప్రజల కోసం వాడితే అది ఎక్కువకాలం ఉంటుంది’ అంటూ మరో ఉపదేశం ఇచ్చారు.
ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలుండాలి
ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండాలని నూతన డీఎస్పీలకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఫీడ్‌బ్యాక్, నిర్ణయాలే ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా మారుతాయని పేర్కొన్నారు. ‘మీరు నిటారుగా నిలబడి డ్యూటీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుంది. బాధ్యతను గుర్తించి పనిచేయాలని ప్రభుత్వం కోరుకుంటున్నది’ అని పేర్కొన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా మొదట గుర్తుకొచ్చేది పోలీసు వ్యవస్థ అని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

