డార్క్ చాక్లెట్ ఓ విభిన్న ప్రయత్నం
విశ్వదేవ్ రాచకొండ, బిందుమాధవి లీడ్ రోల్స్ చేసిన చిత్రం ‘డార్క్ చాక్లెట్'. శశాంక్ శ్రీవాస్తవయ దర్శకుడు.
విశ్వదేవ్ రాచకొండ, బిందుమాధవి లీడ్ రోల్స్ చేసిన చిత్రం ‘డార్క్ చాక్లెట్’. శశాంక్ శ్రీవాస్తవయ దర్శకుడు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ కలిసి సమర్పిస్తున్న ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా కర్టెన్‌రైజర్ ఈవెంట్‌ని మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇది ప్యాషన్‌తో తీసిన సినిమా అని, ప్రేక్షకులకు ఈ సినిమా గుర్తుండిపోతుందని, తాము క్రియేట్ చేసిన మ్యాజిక్‌ని ఈ నెల 13న ప్రేక్షకులు చూడబోతున్నారని, సినిమా అనే ఫార్మాట్‌కే ఛాలెంజ్ చేసేంత కొత్తగా దర్శకుడు శశాంక్ ఈసినిమాను తెరకెక్కించారని హీరో విశ్వదేవ్ రాచకొండ చెప్పారు.
ఈ సినిమాలో భాగం కావడం పట్ల కథానాయిక బిందు మాధవి ఆనందం వెలిబుచ్చారు. ‘చూసిన వారంతా ఇలాంటి సినిమా చేయాలంటే గట్స్ ఉండాలంటున్నారు. కథ రాసేటప్పుడు నేనలా అనుకోలేదు. విశ్వదేవ్ లేకపోతే ఈ ప్రయాణం లేదు. తన నటనతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడు. ఈ సినిమా మూడురోజులకు ముందే యూఎస్‌లో విడుదల అవుతున్నది. ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని దర్శకుడు శశాంక్ శ్రీవాస్తవయ నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా దర్శకులు రవికాంత్, ఆదిత్య, మల్లిక్‌రామ్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

