Harish Rao | పోలీసు కుటుంబం నుంచి వచ్చానన్నావ్.. మరి వారి ఆవేదన ఎందుకు అర్థం చేసుకోవడం లేదు: హరీశ్‌రావు
పది మంది పోలీసులను సర్వీస్ నుంచి తొలగించడంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరితే కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగించడం హేయమైన చర్య అని విమర్శించారు.
హైదరాబాద్: పది మంది పోలీసులను సర్వీస్ నుంచి తొలగించడంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరితే కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగించడం హేయమైన చర్య అని విమర్శించారు. తాను పోలీసు కుటుంబం నుంచి వచ్చానని, పోలీసుల కష్టాలు తనకు తెలుసని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఊదరగొట్టారని ఫైరయ్యారు. అధికారం లేకుంటే ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాటనా అని ప్రశ్నించారు. పోలీసుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారని, వారి ఆవేదన ఎందుకు అర్థం చేసుకోవడం లేదని నిలదీశారు. .
భేషజాలు పక్కన పెట్టి టీజీఎస్పీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలన్నారు. 10 మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పారు. సస్పెండ్ చేసిన 39 మంది కానిస్టేబుళ్లను కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘‘ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరితే 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను పోలీసు కుటుంబం నుండి వచ్చిన. పోలీసుల కష్టాలు నాకు తెల్సు. ఇంట్లో భార్య, బిడ్డలు పడే బాధ నాకు తెలుసు.. అంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి గారు.. అధికారంలోకి వచ్చాక పోలీసుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు.?
వారి ఆవేదన ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. అధికారం లేకుంటే ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాటనా..? భేషజాలు పక్కన పెట్టి.. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, 10 మందిని ఉద్యోగం నుండి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకొని, సస్పెండ్ చేసిన 39 మంది కానిస్టేబుళ్లను కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’’ అంటూ హరీశ్‌రావు ట్వీట్ చేశారు.
ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరితే 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
“నేను పోలీసు కుటుంబం నుండి వచ్చిన. పోలీసుల కష్టాలు నాకు తెల్సు. ఇంట్లో భార్య, బిడ్డలు పడే బాధ నాకు తెలుసు” అంటూ ఎన్నికల… pic.twitter.com/Xa4850MAt4
— Harish Rao Thanneeru (@BRSHarish) October 28, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

