హైదరాబాద్: అర్ధరాత్రి అరెస్టు చేసిన లగచర్ల వాసులను వెంటనే విడుదల చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీని వ్యతిరేకించిన వారిపట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. 300 మంది పోలీసులతో గ్రామాన్ని ముట్టడించి.. గ్రామస్థులను అరెస్టు చేయడం దారుణమన్నారు. ఫార్మా భూసేకరణకు నిరాకరించిన వాళ్లను పోలీసులతో బెదిరించాలని చూడటం దారుణమన్నారు.
అర్ధరాత్రి పోలీసులతో ప్రభుత్వ దమనకాండ నిర్వహించడం సరికాదని చెప్పారు. ప్రభత్వ తీరును ఖండిస్తున్నామన్నారు. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోకుండా భూసేకరణ చేపట్టడం వెనుక ఉన్న రేవంత్ రెడ్డి ఉద్దేశ్యం తెలియాలన్నారు. సీఎం వ్యక్తిగత ప్రయోజనాలకోసం చేపడుతున్న భూసేకరణను తక్షణం నిలిపివేయాలని తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న గ్రామస్థులను, రైతులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ తీరు అమానుషం …లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలి.
లగచర్ల గ్రామానికి 300 మంది పోలీసులు చేరుకొని గ్రామస్థులను అరెస్టు చేయడం దారుణం.
ఫార్మా భూసేకరణకు నిరాకరించిన వాళ్ళను పోలీసులతో బెదిరించాలని చూడడం దారుణం.
అర్ధరాత్రి పోలీసులతో ప్రభుత్వం దమనకాండ నిర్వహించడం సరికాదు.…
— Harish Rao Thanneeru (@BRSHarish) November 12, 2024