Harish Rao | 2018లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ ప్రతిపాదన ఉందని భట్టి విక్రమార్క నిన్న చెప్పారని హరీశ్‌రావు ప్రస్తావించారు. కానీ ఈ సైట్ విజిట్ సిఫార్సు 2018లో ఎటువంటి పనుల కోసం ఇచ్చారనేది చెప్పలేదని అన్నారు. CMPDI సిఫార్సు ఇచ్చింది అని భట్టి బయటపెట్టిన డాక్యుమెంట్ ఇది.. ఇందులో సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎటువంటి పనుల కోసం పెట్టారనేది స్పష్టంగా ఉందన్నారు.
‘ 2018లో సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ (CMPDI) సైట్ విజిట్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ ను ప్రతిపాదించిందని భట్టి చెబుతున్నారు. కానీ ఇక్కడే ఒక అత్యంత కీలకమైన, మౌలిక ప్రశ్న తలెత్తుతుంది? ఆ సిఫార్సు అసలు ఎటువంటి పనుల కోసం? అది కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల కోసమా? కోల్ ఎవాక్యుయేషన్ సిస్టమ్‌ల కోసమా? స్క్రీనింగ్ లేదా వాషింగ్ ప్లాంట్ల కోసమా? లేదా నిజంగానే OB (ఓవర్‌బర్డన్) రిమూవల్ పనుల కోసమా? సైట్ విజిట్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్” అనేది పరిమిత ప్రాంతాల్లో (Confined Area) జరిగే డిజైన్, సరఫరా, ఇన్స్టాలేషన్, కమిషనింగ్ (DSEC) పనులకు మాత్రమే వర్తించే సాంకేతిక నిబంధన. సైనిక్ స్కూల్ వాళ్ళు ఒక టెండర్ పిలిచారు, ఇందులో సప్లై అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ క్లాత్ డ్రైయర్ కోసం సైట్ విజిట్ పెట్టారు. దాన్ని తీసుకొచ్చి సింగరేణి ఓబీ కాంట్రాక్టుకు లింకు పెట్టి చూపడం హాస్యాస్పదం. ‘ అని హరీశ్‌రావు విమర్శించారు.
‘ నిన్న భట్టి విక్రమార్క చూపించిన ఈ డాక్యుమెంట్లో ఎక్కడైనా OB రిమూవల్ కోసం సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టారా? ఎక్కడ కూడా ఓబీ రిమూవల్ కాంట్రాక్టుకు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఓబీ రిమూవల్ కాంట్రాక్టు పద్ధతికి వర్తించని నిబంధనలు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. గతంలో ఎప్పుడూ కూడా ఓబీ వర్క్స్ కు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం లేనేలేదు. మరో ముఖ్యమైన అంశం.. నిజంగా CMPDI సిఫార్సు OB పనులకే అయితే, 2018 నుంచి 2024 వరకు సింగరేణి పిలిచిన వందలాది OB టెండర్లలో ఈ షరతు ఒక్కసారి కూడా ఎందుకు లేదు? 2018 నుంచి 2024 వరకు ప్రతి OB టెండర్లో ఈ షరతు లేదు. మరి ఇప్పుడు, 2025–26లో మాత్రమే, అదీ కొన్ని ఎంపిక చేసిన టెండర్లకే, ఈ షరతు ఎందుకు అకస్మాత్తుగా తీసుకొచ్చారు? OB విషయంలో సైట్ విజిట్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ విధానం తెచ్చింది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే అన్న నిజాన్ని ఎందుకు ఒప్పుకోలేదు భట్టి గారూ?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
2025 జనవరిలో భూపాలపల్లిలో ఒక ఓబీ కాంట్రాక్ట్ టెండర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ లేకుండా పిలిచారు
అంటే పాత బీఆర్ఎస్ విధానాన్నే కొనసాగించారు.. పాత విధానంలోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ లేకుండా టెండర్ పిలిచారు
అయితే మూడు నెలల తర్వాత 2025 మేలో వీఆర్ ఓసీ టెండర్ సైట్ విజిట్ సర్టిఫికెట్… https://t.co/GBTHYd8iMi pic.twitter.com/8CiDQjiUfV
— Telugu Scribe (@TeluguScribe) January 25, 2026
‘2025 జనవరిలో భూపాలపల్లి టెండర్‌కు సైట్ విజిట్ షరతు లేకుండానే రివర్స్ ఆక్షన్ ద్వారా అంచనా రేట్ల కంటే 7% తక్కువకు పనులు అప్పగించారు. అప్పుడు సైట్ విజిట్ అవసరం లేదా? కానీ మూడు నెలల్లోనే 2025 మేలో VK OC టెండర్‌కు మాత్రం సైట్ విజిట్ సర్టిఫికేట్ షరతు పెట్టారు? పోటీ తగ్గిపోయింది. ఫలితంగా అంచనా రేట్లకంటే ఎక్కువ రేట్లకు లబ్ధిదారులు సృజన్ రెడ్డి Shoda Constructions కాంట్రాక్టర్‌కు పని దక్కింది. ఓబీ రిమూవల్ కాంట్రాక్టర్లు సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టడం వల్ల మొట్టమొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి. అన్ని ఓబీ వర్క్స్ కు సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన పెట్టి అన్ని రింగ్ చేయడం, +7% నుండి +10% కు టెండర్ వేయడం, ఏటీఎంలో వచ్చిన 10% క్యాష్ డౌన్ చేయాలి అనే నిబంధన పెట్టుకున్నారు. 2025 మే తర్వాత ఓబీ రిమూవల్ కాంట్రాక్టర్లకు ఏ టెండర్ వచ్చినా, సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎవరికి ఇవ్వాలన్నా ఈయనే రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి. ఇంత స్పష్టంగా నేను బయటపెట్టినా కూడా స్కాం జరగలేదని భట్టి గారు బుకాయించడం శోచనీయం. ఒక నైని గోల్డ్ బ్లాక్ టెండర్ రద్దు చేయడమే కాదు, సైట్ విజిట్ సర్టిఫికెట్ తో ఖరారైన టెండర్లన్నీ రద్దు చేయాలి. ‘ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఇప్పటికే కొన్ని అవార్డు అయిన టెండర్లు ఉన్నాయి, మరికొన్ని టెండర్ ప్రక్రియ తొలి దశలో ఉన్నాయి, ఇంకొన్ని టెండర్ దాఖలు చేసే దశలో ఉన్నాయి.
సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది లోపభూయిష్టమైనది. ఇందులో అవినీతి జరుగుతున్నదని స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. మీకు పారదర్శకత్వం ఉంటే, నిజాయితీ ఉంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ మీద జరిగిన ఓబీ వర్క్స్, సోలార్ పవర్ ప్లాంట్స్, మిగతా అన్ని టెండర్లను క్యాన్సిల్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ‘ 2025 తర్వాత పిలిచిన టెండర్లలో చాలా మంది కాంట్రాక్టర్లు సైట్ విజిట్ చేశారు. లేఖలు ఇచ్చారు, అధికారిక ఇమెయిల్స్ పంపారు, ఫోటోలు కూడా జతచేశారు. అయినా వారికి సర్టిఫికెట్లు ఇవ్వలేదు. టెండర్ చివరి గంట వరకు కాంట్రాక్టర్లను వేచిచూసేలా చేసి, కేవలం 2–3 సంస్థలకు మాత్రమే పాత తేదీలతో బ్యాక్‌డేటెడ్ సర్టిఫికెట్లు జారీ చేశారు. టెండర్ డాక్యుమెంట్లో సైట్ విజిట్ చేసిన వెంటనే స్థానిక GM సర్టిఫికేట్ ఇవ్వాలి అని స్పష్టంగా ఉంది. మరి సైట్ విజిట్ చేసినప్పటికీ ఎందుకు ఇవ్వలేదు? ఈ ఆలస్యం వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి? ఏ చీకటి ఒప్పందం ఉంది? ఎవరి వాటాలు, కమిషన్లు దాగి ఉన్నాయి? ‘ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
‘ నైనీ టెండర్‌ను 2021, 2022లో రెండు సార్లు పిలిచినప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ షరతే లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవసరం లేనిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అకస్మాత్తుగా ఎందుకు అవసరమైంది?మే 2025 నుంచి ఇప్పటివరకు ఎన్ని కాంట్రాక్టర్లు సైట్లు సందర్శించారు? ఎన్ని ఇమెయిల్స్, లేఖలు వచ్చాయి? ఎన్ని సర్టిఫికెట్లు జారీ అయ్యాయి? మిగిలినవాటిని ఎందుకు కారణం చెప్పకుండా తిరస్కరించారు? దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మాకు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని NCC కంపెనీ, GRN కంపెనీ, మహాలక్ష్మి కంపెనీ ఇలా ఎన్నో కంపెనీలు మెయిల్ చేశాయని.. ఈ మెయిల్స్ అన్ని బయటపెట్టాలన్నారు. మీరు బయట పెట్టకపోతే మేమే ఆ మెయిల్స్ ను బయటపెడతామని హెచ్చరించారు. జీ ఎం ఆఫీసు ముందు సెల్ఫీలు పెట్టుకున్నారు, ఇది నిజమా కాదా? ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? అని ప్రశ్నించారు.
కాంట్రాక్టర్లు సింగరేణి జీఎం ఆఫీస్ ముందు ఫోటో తీసుకొని మేము సైట్ విజిట్ చేసాము.. మా టెండర్‌ను కన్సిడర్ చేయండని అనేక మంది మెయిల్స్ పంపారు
ఇలా ఎన్నో కంపెనీలు మేము సైట్ విజిట్ చేసాము మాకు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వలేదని చెబుతున్నారు
వాళ్ళు పంపిన మెయిల్స్ మీరు బైటపెడతారా నేను… https://t.co/GBTHYd8iMi pic.twitter.com/bk2lRZ5VvB
— Telugu Scribe (@TeluguScribe) January 25, 2026