Harish Rao | ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో దవాఖానలు మూతపడే పరిస్థితులు ఏర్పడ్డాయి : హరీశ్ రావు
Harish Rao | ఆరోగ్య శ్రీ బిల్లులు గ్రీన్ ఛానెల్లో విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నది. కానీ,ఆ నిధులు విడుదల కావడం లేదు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
హైదరాబాద్ : ఆరోగ్య శ్రీ బిల్లులు గ్రీన్ ఛానెల్లో విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నది. కానీ,ఆ నిధులు విడుదల కావడం లేదు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.5 లక్షలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారు. రూ.5 లక్షలు నుండి రూ.10 లక్షలు పెంచడం వల్ల రెండున్నర సంవత్సరాలలో కేవలం 496 మంది మాత్రమే లబ్ధి పొందాదన్నారు. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ మేజర్ సర్జరీలకు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు.. దాని మీద రివ్యూ చేయాలని సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆరోగ్య శ్రీ కింద రూ.5 లక్షల నుండి రూ.15 లక్షల వరకు 607 మందికి డబ్బులు విడుదల చేశామని, కానీ మీరు 496 మందికే ఇచ్చారన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని నోటీసులు ఇచ్చినా బిల్లులు రిలీజ్ కావడం లేదని ఆరోపించారు. చిన్న చిన్న దవాఖానలు మూతపడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఆరోగ్యశ్రీ కింద పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయో.. ఎప్పటిలోగా చెల్లిస్తారో సదరు శాఖకు సంబంధించిన మంత్రి సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

