దమ్మపేటలో వివాదాస్పద భూముల పరిశీలన
దమ్మపేట మండల కేంద్రం పరిధిలోని సర్వే నంబర్ 273/1 లో ఉన్న వివాదాస్పద భూములను మంగళవారం దమ్మపేట తాసీల్దార్ అండర్ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్) రెవెన్యూ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ భూములపై యాజమాన్య హక్కులకు సంబంధించి ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అందిన దరఖాస్తుల నేపథ్యంలో...
– క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల విచారణ
– వాస్తవాలు వివరించిన స్థానిక రైతులు
– కలెక్టర్కు సమగ్ర నివేదిక ఇస్తామన్న తాసీల్దార్ (డిప్యూటీ కలెక్టర్)
దమ్మపేట, జూలై 28 : దమ్మపేట మండల కేంద్రం పరిధిలోని సర్వే నంబర్ 273/1 లో ఉన్న వివాదాస్పద భూములను మంగళవారం దమ్మపేట తాసీల్దార్ అండర్ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్) రెవెన్యూ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ భూములపై యాజమాన్య హక్కులకు సంబంధించి ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అందిన దరఖాస్తుల నేపథ్యంలో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఈ క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. వివాదాస్పద భూమిని పరిశీలించేందుకు అధికారులు వస్తున్నారన్న సమాచారంతో దమ్మపేట మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులు విచారణ ప్రదేశానికి చేరుకున్నారు. దశాబ్దాలుగా ఈ భూములను గట్ల సర్వేశ్వరరావు, మల్లా కమల, జంగాల వెంకటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ గోళ్ల వెంకటేశ్వర్లు, గోళ్ల సీతారావమ్మ, బొగ్గం శివ, బొగ్గం గ్రేసుమని తదితరులు సాగు చేసుకుంటున్నారని, వారే అసలైన హక్కుదారులని విచారణ అధికారుల ముందు స్థానిక రైతులు సాక్ష్యాలు చెప్పారు.
ఈ సందర్భంగా సాగులో ఉన్న రైతులు సైతం తమ వద్ద ఉన్న న్యాయపరమైన ఆధారాలు, రికార్డులను అధికారులకు సమర్పించారు. క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించి, రైతుల వద్ద ఉన్న పత్రాలను తీసుకున్న అనంతరం తాసీల్దార్ మాట్లాడారు. ఈ భూమికి సంబంధించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను, వివరాలను నమోదు చేసుకున్నామని ఆయన తెలిపారు. రైతులు అందజేసిన పత్రాలతో పాటు, ఇరువర్గాల రికార్డులను పారదర్శకంగా విచారించి జిల్లా కలెక్టర్కు వాస్తవాలతో కూడిన సమగ్ర నివేదికను అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల గిర్దావర్, సర్వేయర్, గ్రామ పరిపాలనా అధికారి (వీఆర్ఓ) పాల్గొన్నారు.

దమ్మపేటలో వివాదాస్పద భూముల పరిశీలన
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

