సిద్దిపేట : ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లన్న సాగర్(Mallanna sagar), కొండపోచమ్మ సాగర్ బాధితులపై కపట ప్రేమ చూపిస్తున్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని గొప్పగా చెప్తుండు. దమ్ముంటే బీఆర్ఎస్ హయాంలో చేసినట్లు మూసీ(Moosi victims) బాధితులకు న్యాయం చేయా లని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao )సవాల్ విసిరారు. గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు.
మల్లన్న సాగర్, కొండపోచమ్మ బాధితులకు పాత ఇండ్లకు రూ.694 కోట్లు, ఇంటి యజమానికి ఉపాధి కింద రూ.7లక్షల 50 వేలు ఇచ్చాం. అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చాం. పెళ్లికాని పిల్లలకు 250 గజాల ఖాళీ స్థలం ఇచ్చాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గజ్వేల్ పట్టణ నడిబొడ్డున ఇచ్చాం. మూసీ ఇండ్లు కూల్చి, కేసీఅర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. నాడు కేసీఆర్ ఎలాగైతే భూ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి ఇచ్చారో అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మూసీ బాధితులకు గచ్చిబౌలిలో(Gachibowli) 250 గజాల స్థలంలో ఇల్లు కట్టి ఇవ్వాలన్నారు. 675 ఎకరాలలో దేశలోనే నెంబర్ వన్ ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మించి ఇచ్చామని గుర్తు చేశారు. పేదల కోసం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి ఇస్తే మూసీ బాధితులకు ఇచ్చి రేవంత్ సొంత డబ్బా కొట్టు కుంటున్నాడని విమర్శించారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తుండు. గజ్వేల్‌లో 3,414 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించామన్నారు. ముంపు గ్రామాల బాధితులకు రూ.2 వేల కోట్లు కేసీఆర్ ఖర్చు పెట్టారు.
మీ ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా మల్లన్న సాగర్ నిర్వాసితులకు రూపాయి అయిన ఇచ్చారా? అని ప్రశ్నించారు. తునికి బొల్లారంలో నాడు కేసీఆర్ 400 ఎకరాల్లో భూ నిర్వాసితుల కోసం ఇండస్ట్రియల్ పార్క్ కట్టిండు. వర్గల్ మండలంలో పరిశ్రమలు రాకుండా కాంగ్రెస్ వాళ్ళు అడ్డు పడుతున్నా రని విమర్శించారు. ఆ రోజు కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకొని ఈ రోజు రూపాయి ఇవ్వకుండా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ మిగిలిన నిర్వాసితులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.