హైదరాబాద్ మే 23 (నమస్తేతెలంగాణ): సీఎం పర్యటిస్తున్న ప్రతిసారి ముం దస్తు అరెస్టులు, అక్రమ నిర్బంధాలెందు కు? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. నాగర్‌కర్నూల్‌లో చెంచులు, జహీరాబాద్‌లో రైతులు, నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడమే రేవంత్ మార్క్ ప్రజాపాలనా? అంటూ నిలదీశారు.
జహీరాబాద్ ని మ్స్ చుట్టూ ఉన్న గ్రామాలను అష్టదిగ్బం ధం చేసి రైతులను అరెస్ట్ చేయడాన్ని శుక్రవారం ఎక్స్ వేదికగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో పౌరుల భావప్రకటనా స్వేచ్ఛ, ఆవేదనను వ్యక్తం చేసే హక్కును హరించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు లేనిది ముఖ్యమంత్రి పర్యటన సాగేట్టులేదని ఎద్దేవా చేశారు. రైతులు, నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.