Harish Rao : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్(BR Gavai)పై షూ దాడిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని హరీశ్ అన్నారు. సీజేఐపై షూ దాడి సిగ్గుచేటు అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు మాజీ మంత్రి. గౌరవనీయులైన చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి సిగ్గుచేటు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయనపై దాడి చేయబోయిన వాళ్లను సత్వరమే శిక్షించాలి అని హరీశ్ తన పోస్ట్‌లో వెల్లడించారు.
మరొక ట్వీట్లో నెక్కొండ మండలంలోని ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్ధులను చేర్చుకోకపోవడాన్ని ప్రస్తావించారు ఎమ్మెల్యే. ఈ విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవ తీసుకొని.. తక్షణమే పెండింగ్ నిధులను విడుదల చేయాలని ఆయన కోరారు.
Strongly condemn the shameful attack on Honourable Chief Justice of India BR Gavai ji.
Perpetrators must be brought to justice immediately.
— Harish Rao Thanneeru (@BRSHarish) October 6, 2025
Parents in Nekkonda Mandal held a protest with their children after private schools under the Best Available Scheme refused entry, citing non-payment of fees by the Government.
We appeal to Hon’ble Dy CM @Bhatti_Mallu Garu to take urgent action and release the pending funds, so… pic.twitter.com/oSWwPcqFXu
— Harish Rao Thanneeru (@BRSHarish) October 6, 2025
ప్రధాని నరేంద్ర మోడీ సైతం సీజేఐ గవాయ్‌పై దాడిని ఖండించారు. మన సమాజంలో ఇలాంటి అనైతికమైన చర్యలకు తావు లేదని మోడీ ఆయనతో అన్నారు. అనంతరం ప్రధాని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. భారత ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై సుప్రీంకోర్టు ఆవరణలో జరిగిన దాడి భారతీయులను ఆగ్రహానికి గురి చేసింది. ఇలాంటి అనైతికమైన.. ఆమోదయోగ్యంకాని చర్యలకు మన సమాజంలో చోటు లేదు. సీజేఐపై దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని మోడీ తన ట్వీట్లో వెల్లడించారు.
Spoke to Chief Justice of India, Justice BR Gavai Ji. The attack on him earlier today in the Supreme Court premises has angered every Indian. There is no place for such reprehensible acts in our society. It is utterly condemnable.
I appreciated the calm displayed by Justice…
— Narendra Modi (@narendramodi) October 6, 2025