రాష్ట్ర ఆర్థికం ఆందోళనకరం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదికలో హెచ్చరించింది. ప్రభుత్వ అప్పులు భారీగా పెరిగాయని, మూలధన వ్యయం గణనీయంగా తగ్గిందని స్పష్టం చేసింది.
- పెరుగుతున్న అప్పులు.. తగ్గిన మూలధన వ్యయం
- తాత్కాలిక అప్పులతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం
- గ్రామ పంచాయతీలకు నిధుల్లో 10 శాతం కోత
- 2024-25 నివేదికలో ‘కాగ్’ వెల్లడి
- కాంగ్రెస్ పాలనా వైఫల్యాన్ని నిగ్గుతేల్చిన కాగ్: హరీశ్
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదికలో హెచ్చరించింది. ప్రభుత్వ అప్పులు భారీగా పెరిగాయని, మూలధన వ్యయం గణనీయంగా తగ్గిందని స్పష్టం చేసింది. 2023-24తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం అప్పులు రూ.43,829 కోట్లు (11%) పెరిగినట్టు వెల్లడించింది. 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.65,537 కోట్లు అప్పుగా పొందిందని, ఇందులో ‘వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్’ (చేబదులు)గా రూ.5,842 కోట్లు తెచ్చిందని పేర్కొన్నది. 2020-21లో రూ.2.34 లక్షల కోట్లుగా ఉన్న ప్రభుత్వ అప్పులు 2024-25 నాటికి రూ.3.91 లక్షల కోట్లకు పెరిగాయని, ఇదే సమయంలో మొత్తం అప్పులు రూ.2.78 లక్షల కోట్ల నుంచి రూ.4.47 లక్షల కోట్లకు చేరాయని వివరించింది. ఇవి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో దాదాపు 27 శాతానికి సమానమని పేర్కొన్నది. దీంతో భవిష్యత్తులో వడ్డీ చెల్లింపులు భారీగా పెరిగి అభివృద్ధి వ్యయాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నది.
తగ్గిన మూలధన వ్యయం
రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఎంతో కీలకమైన మూ లధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 36,072 కోట్లకు చేరిందని, ఇది జీఎస్డీపీలో కేవలం 2.20 శాతమేనని ‘కాగ్’ నివేదిక వెల్లడించింది. జీఎస్డీపీ వృద్ధిరేటుతో పోలిస్తే మూలధన వ్యయం ఆశించిన స్థాయిలో పెరగలేదని పేర్కొన్నది. 2023-24లో మూలధన వ్యయం పెరిగినప్పటికీ 2024-25లో మళ్లీ తగ్గుదల నమోదైనట్టు తెలిపింది.
ఇరిగేషన్కు అధిక ప్రాధాన్యం
గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మూలధన వ్యయంలో నీటిపారుదల రంగానికి పెద్దపీట వేసింది. ఆ రంగానికి రూ. 22,643 కోట్లు (63 శాతం) ఖర్చు చేసింది. రహదారులు, వంతెనలకు రూ. 4,243 కోట్లు, మైనర్ ఇరిగేషన్ (చిన్న నీటిపారుదల)కు రూ.1,237 కోట్లు, వైద్యారోగ్యానికి రూ.892 కోట్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్యానికి రూ.774 కోట్లు, విద్య, క్రీడలు, కళలు, సాం స్కృతిక రంగాలకు రూ.311 కోట్లు, ఇతర వ్య యాల కింద రూ.5,723 కోట్లు (16 శాతం) వెచ్చించినట్టు ‘కాగ్’ నివేదిక వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

