Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Kiran Abbavaram | ప్రస్తుతం వెండితెరపై భారీ యాక్షన్ సినిమాలు, రక్తపాతం, హింసతో కూడిన కథలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో స్వచ్ఛమైన భావోద్వేగాలు, బాల్యపు మధుర జ్ఞాపకాలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది ‘సమ్మర్ హాలిడేస్’ చిత్రం. 2000వ దశకం ఆరంభంలోని పల్లెటూరి వాతావరణం, అమ్మమ్మ ఊరి అనుభూతులు, చిన్ననాటి అల్లర్లు, చదువుల ఒత్తిడి వంటి అంశాలతో ఈ సినిమాను రూపొందించారు.
Kiran Abbavaram | ప్రస్తుతం వెండితెరపై భారీ యాక్షన్ సినిమాలు, రక్తపాతం, హింసతో కూడిన కథలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో స్వచ్ఛమైన భావోద్వేగాలు, బాల్యపు మధుర జ్ఞాపకాలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది ‘సమ్మర్ హాలిడేస్’ చిత్రం. 2000వ దశకం ఆరంభంలోని పల్లెటూరి వాతావరణం, అమ్మమ్మ ఊరి అనుభూతులు, చిన్ననాటి అల్లర్లు, చదువుల ఒత్తిడి వంటి అంశాలతో ఈ సినిమాను రూపొందించారు. పిల్లల ప్రపంచం ద్వారా పెద్దలకు కూడా జీవితంలోని విలువైన విషయాలను గుర్తుచేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీపావళి కానుకగా నవంబర్ 6న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఘనంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సినిమాపై ప్రశంసలు కురిపించారు.
దర్శకుడు శ్రీకర్ నయన్ జి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్, విజిబి ఫిలింస్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని సంయుక్తంగా నిర్మించారు. సింజిత్ యెర్రమిల్లి సంగీతం అందించారు. ఈ సినిమాలో మాస్టర్ రోహన్, ‘35 చిన్న కథ కాదు’ ఫేమ్ మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి ప్రధాన బాల నటులుగా కనిపించనున్నారు. సీనియర్ నటులు జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి ఆనంద్, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. ప్రీ రిలీజ్ వేడుకలో బాల నటీనటులు వేదికపై చూపించిన చురుకుదనం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు.. ఇది పిల్లలు నటించిన పెద్దల సినిమా అని అభివర్ణించారు. ప్రతి ఒక్కరి ముఖంపై చిరునవ్వు తీసుకొచ్చే కథతో ఈ చిత్రం రూపొందిందని ప్రశంసించారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన యువ హీరో కిరణ్ అబ్బవరం పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుత తరం చిన్నారుల్లో కనిపిస్తున్న ప్రతిభ, ఆత్మవిశ్వాసం తనను ఆశ్చర్యపరుస్తున్నాయని చెప్పారు. తమ చిన్నతనంలో ఇంతటి అవగాహన ఉండేది కాదని గుర్తుచేసుకున్నారు.ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఉరుకుల పరుగుల జీవితంతో ఒత్తిడికి గురవుతున్నారని కిరణ్ అబ్బవరం అన్నారు. ఎంతటి ఐశ్వర్యం ఉన్నప్పటికీ, జీవితంలో ఒక్క ఏడాది వ్యవసాయం చేస్తే లభించే మనశ్శాంతి వెలకట్టలేనిదని పేర్కొన్నారు. ‘సమ్మర్ హాలిడేస్’ చిత్రంలోని కథ, సన్నివేశాలు ప్రేక్షకులను వారి చిన్ననాటి జ్ఞాపకాల వైపు తీసుకెళ్తాయని కిరణ్ అబ్బవరం అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అమ్మమ్మ ఊరు, వేసవి సెలవులు, స్నేహితులతో ఆటలు, బాల్యంలోని అల్లరి వంటి అనుభూతులు ప్రతి ఒక్కరికీ గుర్తుకొస్తాయని చెప్పారు. పండగ సమయంలో కుటుంబ సభ్యులంతా కలిసి థియేటర్లకు వెళ్లి చూడదగ్గ చిత్రమిదని ప్రేక్షకులకు పిలుపునిచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

