Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Vijay | తమిళ చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా థియేటర్ల యాజమాన్యాలకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్తగా విడుదలయ్యే సినిమాలకు తొలి వారంలో రోజుకు ఆరు ఆటలు ప్రదర్శించుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. ఉదయాన్నే ఆటలు ప్రారంభించుకునే వెసులుబాటును కూడా కల్పించింది.
Vijay | తమిళ చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా థియేటర్ల యాజమాన్యాలకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్తగా విడుదలయ్యే సినిమాలకు తొలి వారంలో రోజుకు ఆరు ఆటలు ప్రదర్శించుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. ఉదయాన్నే ఆటలు ప్రారంభించుకునే వెసులుబాటును కూడా కల్పించింది. అయితే థియేటర్ల యాజమాన్యాలు, నిర్మాతలు కోరిన టికెట్ ధరల పెంపునకు మాత్రం ప్రభుత్వం అంగీకరించలేదు. తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. కొత్తగా విడుదలైన సినిమాలకు మొదటి వారం రోజుల పాటు రోజుకు ఆరు ఆటలు ప్రదర్శించుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2.30 గంటల వరకు ప్రదర్శనలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు.
సాధారణ రోజులతో పాటు పండుగలు, ప్రభుత్వ సెలవులు, శని, ఆదివారాల్లోనూ ఈ వెసులుబాటు వర్తించనుంది. అంతేకాదు, ప్రతి సినిమాకు ప్రత్యేకంగా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా నిబంధనలను సరళీకరించారు. గతంలో తమిళనాడులో థియేటర్లు రోజుకు నాలుగు ఆటలు మాత్రమే ప్రదర్శించేవి. మొదటి ఆట ఉదయం 9 లేదా 10 గంటలకు ప్రారంభమయ్యేది. విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త సినిమాలకు తొలి వారంలో ఐదు ఆటలు ప్రదర్శించుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆ సంఖ్యను ఆరుకు పెంచడంతో థియేటర్లకు మరింత వెసులుబాటు లభించింది. థియేటర్ల యాజమాన్యాలు, తమిళ నిర్మాతలు టికెట్ ధరలను పెంచుకునేందుకు కూడా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఈ విషయంలో విజయ్ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోలేదు. ఆరు ఆటలకు అనుమతి ఇచ్చినా టికెట్ ధరల పెంపునకు మాత్రం నో చెప్పింది. దీంతో నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యులకు ఒకవైపు ఊరట లభించగా, మరోవైపు టికెట్ ధరల విషయంలో నిరాశ ఎదురైంది.
విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతల సంఘాలు, థియేటర్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాల ప్రతినిధులు తమ సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తమిళనాడు సమాచార, ప్రచార శాఖ మంత్రి ఎ. రాజ్‌మోహన్‌తో చర్చలు జరిపిన అనంతరం ఆరు ఆటలకు అనుమతి లభించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సుమారు 1,200 అదనపు ఆటలు పెరిగే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా అగ్ర హీరోల సినిమాలు విడుదలయ్యే సమయంలో తెల్లవారుజామున నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి కనిపించనుంది. అయితే టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వకపోవడం ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

