Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Anirudh-Kavya | ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సీఈవో కావ్య మారన్ వివాహ వేడుకపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వీరి పెళ్లి కోసం కుటుంబ సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ వేడుకకు సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన పెళ్లి పత్రికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Anirudh-Kavya | ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సీఈవో కావ్య మారన్ వివాహ వేడుకపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వీరి పెళ్లి కోసం కుటుంబ సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ వేడుకకు సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన పెళ్లి పత్రికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణ ఆహ్వాన పత్రికలకు భిన్నంగా రాజభవనాన్ని తలపించేలా రూపొందించిన ఈ ప్రత్యేక పెట్టె ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వైరల్ అవుతున్న వివరాల ప్రకారం.. నవంబర్ 10, 11 తేదీల్లో గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరగనుంది. అనంతరం నవంబర్ 21న చెన్నైలో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ పెళ్లి తేదీలు, ఏర్పాట్లపై అధికారిక ప్రకటన ఉందా అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది. కాగా, అనిరుధ్, కావ్య మారన్ల కోసం రూపొందించిన ప్రత్యేక ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 17వ శతాబ్దపు ఐరోపా రాజభవనాల నిర్మాణ శైలిలో ప్రసిద్ధి చెందిన బరోక్ కళారూపం స్ఫూర్తితో దీనిని రూపొందించారు. పౌడర్ బ్లూ, ఐవరీ, సిల్వర్ రంగుల కలయికతో ఆకర్షణీయమైన 3డీ డిజైన్‌ను తీర్చిదిద్దారు. మొత్తం పెట్టెను చూస్తే పాతకాలపు రాజవంశాల కళాఖండంలా కనిపిస్తోంది. ఈ ప్రత్యేక ఆహ్వాన పత్రికను ‘పింక్ విజిల్ మ్యాన్’ సంస్థ అధినేత్రి రంజని అయ్యంగార్ రూపొందించారు. ఒక్కో పెట్టె తయారీకి సుమారు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్పై నెటిజన్లు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు.
ఈ ఆహ్వాన పత్రిక రూపకల్పన వెనుక చాలా శ్రమ ఉందని రంజని అయ్యంగార్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. డిజైన్ ఆలోచన వారం రోజుల్లోనే వచ్చినప్పటికీ, దానికి తుది రూపం ఇవ్వడానికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టిందని చెప్పారు. ముఖ్యంగా పెట్టె నాణ్యత, బరువు, నిర్మాణం వంటి అంశాలను పలుమార్లు పరిశీలించి మార్పులు చేసినట్లు వివరించారు. బరోక్ నిర్మాణ శైలిని ఆధారంగా తీసుకుని 3డీ డిజైన్‌ను చేతితో రూపొందించినట్లు తెలిపారు. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత కూడా ఈ పెట్టెను పడేయకుండా ఇంట్లో అలంకరణ వస్తువుగా ఉపయోగించుకునేలా ప్రత్యేకంగా తీర్చిదిద్దామని చెప్పారు. ఈ ప్రత్యేక ఆహ్వాన పత్రికలను చూసి అనిరుధ్, కావ్య మారన్ ఎంతో సంతోషించారని రంజని వెల్లడించారు. డిజైన్‌ను చూపించినప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా అభినందించినట్లు తెలిపారు. ఆహ్వాన పత్రికలోని చిన్న చిన్న అంశాలను కూడా వారు ఆస్వాదిస్తూ తమ అభిప్రాయాలను పంచుకున్నారని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

