హైదరాబాద్: బీఆర్ఎస్లో కేసీఆరే సుప్రీం అని, ఎవరి విషయంలోనైనా తుది నిర్ణయం పార్టీదేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) స్పష్టం చేశారు. కలిసి పనిచేయడం, ప్రజలకు సేవ చేయడమే కేసీఆర్ తమకు నేర్పించారని చెప్పారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న హరీశ్ రావు.. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నేతల మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగితే రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. ఏడాదిన్నర నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. వానాకాలంలో విద్యుత్ డిమాండే ఉండదని, ఆ సమయంలో బాహుబలి మోటార్లతో నీటిని ఎత్తిపోసుకోవచ్చని చెప్పారు. హైడ్రాతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టడం లేదన్నారు.
Deferred Live from UK: Former Minister @BRSHarish speaking at Meet and Greet Program. https://t.co/M82WHwUyH8
— Office of Harish Rao (@HarishRaoOffice) September 5, 2025