Singareni | కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో..అప్పుల్లో సింగరేణి.. ‘భట్టి’ పుణ్యమే
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి భట్టి విక్రమార్క పుణ్యమా అని సింగరేణి సంస్థ అప్పుల్లో పూర్తిగా కూరుకుపోయిందని, చివరికి బ్యాంకుల వద్దకు ఓడీ కోసం తిరుగాల్సిన దుస్థితి దాపురించిందని మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
- అప్పుల్లో సింగరేణి.. ‘భట్టి’ పుణ్యమే
- తొలి ఎక్సెస్ టెండర్ సీఎం బామ్మర్దిదే
- రూ.1,600 కోట్ల బొగ్గు మాయంపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానమివ్వాలి
- సింగరేణి పరిరక్షణ సభలో హరీశ్‌రావు
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 23(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి భట్టి విక్రమార్క పుణ్యమా అని సింగరేణి సంస్థ అప్పుల్లో పూర్తిగా కూరుకుపోయిందని, చివరికి బ్యాంకుల వద్దకు ఓడీ కోసం తిరుగాల్సిన దుస్థితి దాపురించిందని మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. నాడు సిరుల గనిగా ఉన్న సింగరేణి కాంగ్రెస్ హ యాంలో ఇవాళ కుంభకోణాల ఖనిగా మారిందని విమర్శించారు. సింగరేణిలో దోపిడీని అరికట్టాలంటే కార్మికులు పోరాటానికి సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్లో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, కాపు కృష్ణ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సింగరేణి పరిరక్షణ సభలో ఆయన మాట్లాడారు. నాడు ప్రతి టెండర్లో మైనస్ కోట్ చేస్తే ఇ ప్పుడు ఎక్సెస్ కోడ్‌తో టెండర్లను దక్కించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. సింగరేణి చరిత్రలోనే తొలిసారి ఎక్సెస్ టెండర్లను దక్కించుకున్నది సీఎం బావమరిదేనని ఆ రోపించారు.
అందుకే బొగ్గు లేకున్నా రికార్డుల్లో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ధ్వ జమెత్తారు. మాయమైన రూ.1,600 కోట్ల విలువైన బొగ్గుపై సీఎం రేవంత్, భట్టి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్‌లో టెండర్లను ఏడు సార్లు ఎందుకు వాయిదా వేశారో చెప్పాలన్నారు. ఎన్టీపీసీ లో పవర్ ఉండగా కొత్తగా సోలార్ ప్రాజెక్టు లు ఎందుకని ప్రశ్నించారు. బొగ్గు నిల్వలు గురించి మాట్లాడుతున్న కొత్తగూడెం ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు అవి ఎక్కడున్నాయో చూపెట్టాలని డిమాండ్ చేశారు. కా ర్మికుల పక్షాన ఉండాల్సింది పోయి కాంగ్రెస్‌తో జతకట్టి అన్యాయం చేస్తే వాళ్లే బుద్ధి చెప్తారన్నారు. సదస్సులో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, వనమా వెంకటేశ్వరరావు, ఎమ్మె ల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధుసూదన్, మాజీ విప్ రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్, దిండిగల రాజేందర్, రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

