Harish Rao | అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై నిరసన తెలుపుతూ నల్ల టీషర్ట్ ధరించి వచ్చిన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు, అనిల్ జాదవ్‌ను అసెంబ్లీ లోనికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు.
దీంతో టీషర్ విప్పి బనియన్‌తోనే అసెంబ్లీ ఎదుట వారు నిరసన తెలిపారు. అనంతరం బనియన్‌తోనే అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటనతో అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం 1000 రోజుల పాలనపై నిరసన తెలిపేందుకు నల్ల టీషర్టులు ధరించి వచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్రేకింగ్ న్యూస్
అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద హరీష్ రావు అరెస్ట్
నల్ల టీషర్ట్ ధరించి అసెంబ్లీలోకి రావడంపై పోలీసుల అభ్యంతరం
టీషర్ట్ విప్పి బనియన్‌తో అసెంబ్లీ గేటు ముందు నిరసన వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు, అనిల్ జాదవ్
బనియన్‌తోనే అసెంబ్లీలోకి వెళ్లేందుకు హరీశ్ రావు… https://t.co/0Nua3mziEr pic.twitter.com/JlprGKI63p
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026