సాదాబైనామా ఫీజులు వసూలు చేసి పాస్ పుస్తకాలివ్వరా?
సాదాబైనామా క్రమబద్ధీకరణ పేరిట రైతుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసి, వారికి పాస్ పుస్తకాలు ఇవ్వకుండా, ప్రభుత్వం నట్టేట ముంచుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మక్తల్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఆయనను కలిసి తమ గోడు వెళ్లబోసుకోవడంతో, బుధవారం ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
- కాంగ్రెస్ సరార్‌పై మాజీమంత్రి హరీశ్‌రావు ఫైర్
హైదరాబాద్, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): సాదాబైనామా క్రమబద్ధీకరణ పేరిట రైతుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసి, వారికి పాస్ పుస్తకాలు ఇవ్వకుండా, ప్రభుత్వం నట్టేట ముంచుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మక్తల్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఆయనను కలిసి తమ గోడు వెళ్లబోసుకోవడంతో, బుధవారం ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ధరణి స్థానంలో ‘భూభారతి’ తెస్తామని గొప్పలు చెప్పిన పాలకులు, ఇప్పుడు రికార్డుల విషయంలో అన్నదాతలను తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు. ఎకరానికి రూ. 23 వేల నుంచి రూ. 26 వేల వరకు ఫీజులు కట్టించుకుని నెలలు గడుస్తున్నా.. భూముల వివరాలు ఆన్లైన్లో నమోదు కావడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. చేతిలో కేవలం 13బీ సర్టిఫికెట్లు పెట్టి, పోర్టల్‌లో సాంకేతిక సమస్య ఉందంటూ రైతులను ఎమ్మాఆర్వో, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం దారుణమని మండిపడ్డారు.
ఆన్లైన్లో వివరాలు లేకపోవడంతో పాస్ పుస్తకాలు రాక రైతుబంధు, రైతుబీమా ఆగిపోయాయని, చివరికి పండించిన పంటను అమ్ముకోవడానికి, ఎరువులు పొందడానికి కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సుమారు 62 వేల మంది రైతుల నుంచి ముకుపిండి ఫీజులు వసూలు చేసిన ప్ర భుత్వం, వారి భూమి హకులను ఎందుకు గుర్తించడం లేదని సీఎం రేవంత్‌రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. అధికారుల చుట్టూ తిప్పుకోవడమే ప్రజాపాలనలో రైతులకు దకుతున్న గౌరవమా? అని నిలదీశారు. ఇప్పటికైనా భూభారతి పోర్టల్‌లోని సాంకేతిక సమస్యలను సరిచేసి, ఫీజులు చెల్లించిన రైతులకు తక్షణమే పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు హకులు దకేంత వరకు వారి పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని హరీశ్‌రావు స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

