హైదరాబాద్ : జీహెచ్ఏంసీ అధికారుల(GHMC officials) నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలయింది. చేయని తప్పుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..కృష్ణానగర్(Krishnanagar) ప్రధాన దారిలో విధి దీపాల స్తంభానికి విద్యుత్ సరఫరా కావడంతో ఈ ప్రమాదం ఓటు చేసుకుంది. తుమ్మ భావన రుషి (35) హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా(Hardware engineer )పని చేస్తున్నాడు.
కాగా, అతడు స్తంభం పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో చేయి కరెంట్ స్తంభానికి తగలడంతో కరెంట్ షాక్(Current shock )తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.