హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : ముస్లిం సోదరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు త్యాగానికి ప్రతీకగా బక్రీద్ జరుపుకొంటారని చెప్పారు. ప్రవక్తల అచంచలమైన దైవభక్తి, త్యాగ నిరతికి బక్రీద్ పండుగ అద్దం పడుతుందని పేర్కొన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా, దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని బక్రీద్ పండుగ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. తమకున్న దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని చాటిచెప్తుందని పేర్కొన్నారు.