Kondagattu | కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు.. భారీగా తరలివచ్చిన దీక్షాపరులు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు (Kondagattu) ఆంజనేయస్వామి ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుగనున్న ఈ ఉత్సవాలకు హనుమాన్ దీక్షాపరులు భారీగా తరలివస్తున్నారు.
కొండగట్టు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు (Kondagattu) ఆంజనేయస్వామి ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుగనున్న ఈ ఉత్సవాలకు హనుమాన్ దీక్షాపరులు భారీగా తరలివస్తున్నారు. మాల విరమణకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో అంజన్న క్షేత్రంలో రద్దీ ఏర్పడింది. కాగా, ఉత్సవాల దృష్ట్యా ఆర్జిత సేవలు, వాహన పూజలను అధికారులు రద్దుచేశారు. 900 మంది పోలీసులతో భద్రత ఏర్పాటుచేశారు. ఈ ఉత్సవాలు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు కొండగట్టు అంజన్నను దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఐదొందల ఏండ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి సంబంధించి ఒక కథ ప్రచారం ఉన్నది.. ముత్యంపేట గ్రామానికి చెందిన సింగం సంజీవుడు అనే పశువుల కాపరి ఒకరోజు అడవిలో ఆవులను మేపుతున్నాడు. ఒక ఆవు మందలోనుంచి తప్పిపోవడంతో దానిని వెతుక్కుంటూ అతడు కొండగట్టు వరకు వస్తాడు. ఎండలో తిరిగి అలసి ఓక చెట్టు నీడలో నిద్రపోతాడు. అప్పుడు అతనికి కలలో ఆంజనేయుడు కనిపించి నేను తంబోర పొదలో ఉన్నాను. నాకు గుడి కట్టించు. తప్పిపోయిన నీ ఆవు ఫలానా చోట ఉందని చెప్పాడట. మెలకువ వచ్చాక సంజీవుడికి అక్కడి పొదల్లో వెలిగిపోతున్న హనుమంతుడి విగ్రహం కనిపించిందట.

దాంతో అతడు కొండగట్టులో హనుమంతుడి గుడి కట్టించాడట. అయితే ఇక్కడ హనుమంతుడు ఎక్కడా లేని విధంగా రెండు ముఖాల (నరసింహస్వామి, ఆంజనేయుడు)తో కనిపిస్తాడు. అంతేకాదు ఛాతి మీద సీతారాముల విగ్రహాలు ఉంటాయి. ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న సీతమ్మ బావిలోని నీళ్లతో రోజూ స్వామివారికి అభిషేకం చేయడం ఇక్కడి ఆనవాయితీ. గర్భాలయానికి కుడివైపు వెంకటేశ్వర స్వామి, ఆండాల్.. ఎడమవైపు శివపంచాయతన ఆలయం ఉంటాయి. ఈ ఆలయంలో హనుమాన్ జయంతి ఏడాదిలో రెండుసార్లు (చైత్ర, వైశాఖ మాసాల్లో) జరుగుతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

