సుబేదారి, ఏప్రి ల్ 10 : హనుమకొండ జిల్లా ఆత్మకూరు ఎస్సై సతీశ్ సస్పెండ్ చేస్తూ శుక్రవారం వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై సతీశ్ అవినీతికి పాల్పడటమే గాక కేసుల విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు విచారణలో తేలింది.
ముఖ్యంగా ఇసుక ట్రాక్టర్ల య జమానుల నుంచి లంచం తీసుకోవడం, బెదిరించి టిప్పర్ల తో సొంత పొలంలోకి మట్టిని తరలించడం, ఓ అమ్మాయి కిడ్నాప్ కేసులో నిందితులకు ఎస్సై సతీశ్ సహకరించినట్టు విచారణలో వెల్లడైనందున సస్పెండ్ చేసినట్టు తెలిసింది.