హైదరాబాద్, ఆగస్టు8 (నమస్తే తెలంగాణ) : హైకోర్టు ఆవరణలోని బాలల సంరక్షణ కేంద్రంలో పిల్లలు త యారు చేసిన చేనేత వస్తువుల అమ్మకం కేంద్రాన్ని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్ గురువారం ప్రారంభించారు. వాటిని తయారు చేసిన పిల్లలను ప్రోత్సహించారు. జస్టిస్ మౌసమీ భట్టాచార్య, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమైనదేనని హైకోర్టు తీర్పు చెప్పింది. బోర్డు నిర్వహణకు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిని అధికారిగా నియమిస్తూ జారీ చేసిన జీవో సముచితమేనని పేరొంది. ఈ విషయమై సింగిల్ జడ్జి తీర్పులో జోక్యానికి ఆసారం లేదని హైకోర్టు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం తేల్చింది.
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తాజాగా జరిగిన బదిలీల తో గాంధీ, ఉస్మానియా దవాఖానల్లో వైద్య సిబ్బందిపై ప్రభావంలేదని వైద్యారోగ్యశాఖ తెలిపింది. గతేడాదితో పోల్చితే వైద్య సిబ్బంది సం ఖ్య పెరిగినట్టు వెల్లడించింది. నిరుడు ఆగస్టు 7 నాటికి, నేడు ఉన్న సిబ్బంది వివరాలను విడుదల చేసింది.