వరంగల్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారత రాష్ట్ర సమితి రజతోత్సవ మహాసభకు అనుమతి ఇస్తూ హనుమకొండ జిల్లా కాజీపేట ఏసీపీ శనివారం ఉత్తర్వులు జారీచేశా రు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహణ కోసం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ మార్చి 28న పోలీసులకు దరఖాస్తు చేశారు. ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ అనుమతి మంజూరులో జాప్యం చేశారు. దీంతో పార్టీ హనుమకొండ జి ల్లా అధ్యక్షుడు వినయ్‌భాస్కర్ ఈ నెల 9న హైకోర్టును ఆశ్రయించారు.
వాదనల అనంతరం ఈ నెల 17లోపు నిర్ణయం తీసుకోవాలని కోర్టు పోలీసు శాఖ ను ఆదేశించింది. ఈ మేరకు బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు అనుమతిస్తూ కాజీపేట ఏసీసీ తిరుమల్ రాత్రివేళ సర్క్యులర్‌ను జారీ చేశారు. దా స్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, దివ్యాంగుల సంస్థ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి అనుమతిపత్రాన్ని తీసుకున్నారు.