హైదరాబాద్, ఫిబ్రవరి 17 : హజ్ యాత్రికులకు మెడికల్ కోఆర్డినేటర్లుగా, వైద్యులుగా తాత్కాలిక డిప్యుటేషన్‌పై వెళ్లాలనుకునే ముస్లిం ఉద్యోగులు ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ షఫిఉల్లా తెలిపారు. సౌదీ అరేబియాలోని జెడ్డా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో రెండు నుంచి మూడు నెలల పాటు డిప్యుటేషన్ ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్లో లేదా 040-23298793 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు.