హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్ రావును పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఇటీవల దామోదర్ రావు తల్లి అండాళమ్మ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో బుధవారం దామోదర్‌రావును బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కలిసి పరామర్శించారు. రాష్ట్ర ఎైక్సెజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా దామోదర్‌రావును పరామర్శించారు.