హైదరాబాద్, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ): గురుకులాల్లో నాణ్యమైన విద్యనందించి, విద్యార్థుల్లో నైపుణ్యా మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గురుకులాలపై సచివాలయంలో గురువారం ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యా ప్రమాణాలపై ప్రతీ 15రోజులకోసారి సమీక్షించి నివేదికను రూపొందించాలన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో గురుకులాల్లో క్రీడా, సాంసృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు తయారుచేయాలన్నారు. బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కమిషనర్ బాల మాయాదేవి, గురుకులాల సెక్రటరీ సైదులు, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్యభట్టు, ఎంబీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్, జేడీ సంధ్య, కార్పొరేషన్ ఎండీలు చంద్రశేఖర్, ఇందిర, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.