హైదరాబాద్, సెప్టెంబర్19 (నమస్తే తెలంగాణ): దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించేలా చూడాలని ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఎస్టీ, జనరల్ గురుకులాల కార్యదర్శులకు బోధన, బోధనేతర సిబ్బంది మొరపెట్టుకుంటున్నారు. ఈ మేరకు గురుకుల ప్రిన్సిపాల్స్ ద్వారా విజ్ఞాపన పత్రాలను గురువారం పంపించారు.
గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురుకుల విద్యా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు 3వ రోజూ కొనసాగాయి. ఇటీవల రూపొందించిన పని వేళలతోపాటు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. గురుకుల విద్యా జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు బాలరాజు, యాదయ్య, రుషికేష్కుమార్, ప్రభుదాస్, చలపతి, బాలస్వామి, గోవర్ధన్‌రెడ్డి, ఝాన్సీరాణి, సాంబలక్ష్మి, ఆవుల సైదులు, జానీమియా, శ్రీనివాస్, తదితరులున్నారు.