హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): గురుకుల టీచర్లు, అధ్యాపకుల సమస్యల పరిష్కరించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (పీఆర్‌జీటీఏ) నేతలు కోరారు. మంగళవారం మైనార్టీ గురుకులాల కార్యదర్శి షఫీయుల్లాను కలిసి వివిధ అంశాలపై వారు చర్చించారు. ఇటీవలే ఆవిర్భంచిన సంఘం విధివిధానాలు, ఉద్దేశాలను ఆయనకు వివరించారు.
జాయింట్ సెక్రటరీ లియాకత్ హుస్సేన్, డిప్యూటీ సెక్రటరీ దిలావర్‌ను సైతం అసొసియేషన్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రతినధులు ఉప్పు అశోక్, ఈ శ్రీనివాసాచారి, ఐ నిర్మలానందం, కే రామకృష్ణారెడ్డి, మైనార్టీ గురుకులాల రాష్ట్ర కన్వీనర్ పానుగంటి విజయ్‌కుమార్, కో కన్వీనర్ లక్ష్మారెడ్డి, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.