హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో తలెత్తిన సమస్యల పరిష్కారానికి మళ్లీ పోరుబాట పట్టే ప్రయత్నంలో గురుకుల టీచర్ల జేఏసీతోపాటు టీఎస్ యూటీఎఫ్ ప్రణాళికలు రూపొందిస్తున్నది. దసరా ముందు పో రుబాట పట్టిన టీచర్లు సెలవుల్లో బ్రేక్ వే శారు. ప్రస్తుతం సెలువులు ముగియడం తో మళ్లీ పోరుబాట పట్టడానికి కార్యాచరణ రూపొందించే యత్నాలు చేస్తున్నామని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు చావ రవి తెలిపారు.