కొత్తగూడెం : జిల్లాలోని అన్నపురెడ్డిపల్లెలో ఓ గురుకుల టీచర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. గురువారం రాత్రి రెసిడెన్షియల్ క్వార్టర్స్‌లో ఎస్ కళ్యాణి(26) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఘటనను గమనించిన తోటి టీచర్లు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలు సైన్స్ టీచర్‌గా పని చేస్తోంది. ఆమె సొంతూరు ఇల్లందు మండలంలోని రోంపెడు అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.