వికారాబాద్, మార్చి 3 : టీచర్ల వేధింపులు భరించలేక 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి యత్నించిన ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కొత్తగడి గురుకుల పాఠశాలలో స్ర వంతి టీచర్ తబిత అనే 10వ తరగతి విద్యార్థిని తరచూ వేధించసాగింది. దీంతో మనోవేదనకు గురైన తబిత ఫిబ్రవరి 24న పాఠశాల మొదటి అంతస్తు నుంచి దూకడంతో ఎడమ కాలుకు ఫ్రాక్చర్ అయ్యింది. పాఠశాల సిబ్బంది ప్రైవేటు వాహనంలో ప్రైవేటు దవాఖానకు తరలించి, తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. తబితకు కాలు విరగడంతో సిమెంట్పట్టి వేశారు. సోమవారం విద్యార్థినితో కలిసి తల్లిదండ్రులు వికారాబాద్ కొత్తగడి గురుకుల పాఠశాలకు వచ్చి టీచర్లను నిలదీశారు. విద్యార్థి సంఘాలు పాఠశాలకు చేరుకొని విద్యార్థినిని వేధించిన టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమా ర్ తెలియడంతో ఆ విద్యార్థినిని పరామర్శించాలని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్‌ను పంపించారు. అనంతరం విద్యార్థినితో స్పీకర్ ఫోన్లో మాట్లాడారు. పాఠశాలలో టీచర్లు విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపింది. వెంటనే స్రవంతి మే డంను సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరింది. దీంతో స్పీకర్ టీచర్లతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుటామని హెచ్చరించారు.
బెల్లంపల్లి, మార్చి 3 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎనిమిదో తరగతి విద్యార్థి చక్రధర్‌ను ఇంటర్మీడియట్ విద్యార్థులు బాత్రూం వద్దకు తీసుకెళ్లి బట్టలు విప్పించారు. ఈ ఘటనను చూసిన పదోతరగతి విద్యార్థి ని ఖిల్ ప్రిన్సిపాల్ శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో నిఖిల్‌పై ఆదివారం రాత్రి దాడిచేశారు. సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్, ర్యాగింగ్ విద్యార్థులను నిలదీశారు.