తిరుమలగిరి, డిసెంబర్ 12: మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తండ్రి జీ రామచంద్రారెడ్డి సర్పంచ్‌గా ఎన్నిక కావటంతో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం నాగారంలో సంబురాలు అంబరాన్ని అంటాయి. శుక్రవారం మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆయనకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కిశోర్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ర్టాల్లో 95 ఏండ్ల వయసులో సర్పంచ్‌గా విజయం సాధించి రికార్డు సృష్టించారని కొనియాడారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించటం గొప్ప విషయమని కొనియాడారు. అనంతరం గ్రామస్తులు, నియోజకవర్గ, జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రామచంద్రారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.