దిలావర్పూర్, నవంబర్ 8: నిర్మల్ జిల్లా దిలావర్పూర్-గుండంపల్లి గ్రామాల మధ్యలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను అడ్డుకునేందుకు ముందుకు రావాలని కోరుతూ రెండు రోజుల క్రితం గుండంపల్లి గ్రామస్థులు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు.
నిర్మల్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున.. ఎలాంటి అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని దిలావర్పూర్ ఎస్సై సందీప్ గుండంపల్లి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు శుక్రవారం నోటీసులు అందజేశారు. అనుమతి లేకుండా ర్యాలీ తీసి ప్రచారం చేసినందుకు వీడీసీ సభ్యులు తగిన వివరణ ఇవ్వాలని పోలీసులు పేర్కొన్నారు. నోటీసులకు తాము వివరణ ఇస్తామని వీడీసీ సభ్యులు తెలిపారు.