జూబ్లీహిల్స్, జూలై 18 : విద్యార్థుల్లో మానసికోల్లాసానికి ‘నారాయణ గైడ్‌కాస్ట్’ దిక్సూచిగా నిలుస్తుందని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ సింధూరనారాయణ తెలిపారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని తీర్చిదిద్దేందుకు యూట్యూబ్ వేదికగా గైడ్‌కాస్ట్ మొదటి సీజన్, మొదటి ఎపిసోడ్‌ను మరో డైరెక్టర్ శరణినారాయణతో కలిసి గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ గైడ్‌కాస్ట్ తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండాల్సిన సంబంధాలు, భావోద్వేగ సమయంలో మద్దతు, డిపెండెన్సీ, ఆందోళనలను ప్రస్తావిస్తుందన్నారు. దీనిని విని ఆచరిస్తే అనేక ప్రయోజనాలు పొందవచ్చని సూచించారు.