హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తీరుపై మాజీ మంత్రి హరీష్రావు ( Harish Rao ) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు . నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు కాని స్కాం క్యాలెండర్ మాత్రం ఇచ్చారని ఆరోపించారు. గ్యారంటీ స్కీం ( Guarantee schemes ) లు నిల్..స్కాంలు ఫుల్ అంటూ ఆరోపించారు. 12 నెలల్లో 12 స్కాంలకు పాల్పడారని విమర్శించారు. నెలనెలా ఉద్యోగాలు ఇస్తా.. జాబ్ క్యాలెండర్ తెస్తానని నిరుద్యోగులను నమ్మించి ఓట్లు పొందారని ఆరోపించారు.

జనవరిలో సివిల్ సఫ్లై స్కాం, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లైయాస్ స్కాం , మార్చిలో స్కాండ్ స్కాం, ఏప్రిల్లో ఆర్టీసీ కాంట్రాక్టర్ల స్కాం, మేలో బామ్మర్థికిచ్చిన అమృత్ టెండర్లలో , జూన్లో ఫోర్త్ సిటీ, జులైలో లగచర్ల సెంట్రల్ వర్సిటీ, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్ల స్కాం, సెప్టెంబర్లో 5లక్షల కోట్ల హిల్ టీపీ ఇండ్రస్టియల్ భూములు , అక్టోబర్లో పవర్ , నవంబర్లో సింగరేణి , డిసెంబర్లో కేఎల్ఎస్ఆర్ స్కాంలకు పాల్పడ్డారని ఆరోపించారు.
రైతుల గురించి ముఖ్యమంత్రి ఒక్కడు నాడుకూడా మాట్లాడలేదని విమర్శించారు. గురుకులాల్లో పాముకాటులతో, కల్తీ ఆహారంతో పిల్లల ప్రాణాలు పోతుంటే రేవంత్ రెడ్డి మాట్లాడిండా? అంటూ ప్రశ్నించారు. 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఊసు కూడా ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా కేసీఆర్పై మీద మాత్రం బూతులు మాట్లాడుతాడని ఎద్దేవా చేశారు.